యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర'..'వార్ -2' షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్నినెలలుగా తారక్ ఈ రెండు ప్రాజెక్ట్ లతోనే క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ముంబై టూ హైదరాబాద్ జర్నీ చేస్తున్నాడు. ఇప్పటికే దేవర షూటింగ్ క్లైమాక్స్ కి రావడంతో...మరికొన్ని రోజుల్లో వార్ -2 కోసమే పూర్తిగా సమయాన్ని కేటాయించనున్నాడు. ఎలా లేదన్నా ఏడాది చివరికల్లా రెండు సినిమా ల నుంచి ప్రీ అయిపోతాడు.
అటుపై తారక్ ఏ దర్శకుడితో ముందుకెళ్తాడు? అన్నది ఇంతవరకూ క్లారిటీ లేదు. కేజీఎఫ్ మేకర్ స్టార్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లాక్ అయింది. కానీ ఎప్పుడు ప్రారంభిస్తారు?అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ తారక్-ప్రశాంత్ నీల్ మాత్రం రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. తారక్ కి ఖాళీ సమయం దొరికితే ప్రశాంత్ తోనే కనిపిస్తున్నాడు. దీంతో అతడి ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందా? అన్న అంచనాలు బలపడుతున్నాయి.
సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతలోనే హాయ్ నాన్న దర్శకుడు శూర్యువ్ తో తారక్ సినిమా చేయబోతున్నాడు? అన్నకొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. గత వారం రోజులుగా నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తారక్ కి అదిరిపోయే పాన్ ఇండియా కాన్సెప్ట్ వినిపించాడని, నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లోనే స్టోరీ ఒకే చేసినట్లు కూడా ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రచారంపై శౌర్యువ్ స్పందించాడు. తారక్ కి తాను ఎలాంటి స్టోరీ వినిపించ లేదని, నెట్టింట జరిగే ప్రచారమంతా అవాస్తవమని ఖండించారు. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా పనిచేస్తానని, ఏదోఒక రోజు ఈప్రచారం నిజం కావాలని, వీలైనంత వేగంగానే అది జరిగాలని ఆశాభావం వ్యక్తం చేసారు. శౌర్యువ్ నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించిన 'హాయ్ నాన్న' యావరేజ్ గా ఆడింది. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. మేకింగ్ పరంగానూ సినిమా హైలైట్ అయింది. దీంతో శౌర్యువ్ కి మంచి మేకర్ గా గుర్తింపు దక్కింది.
No comments:
Post a Comment