శ్రీలీల : నాకు ఇంకా అంత అర్హత రాలేదు - Telugu Cinema Samacharam

Breaking

Post Top Ad

Post Top Ad

Wednesday, 14 August 2024

శ్రీలీల : నాకు ఇంకా అంత అర్హత రాలేదు

 


పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్ గా నిలిచింది. మొదటి సినిమా ఫ్లాప్ అయిన ఏ హీరోయిన్‌ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటిది పెళ్లి సందడి ఫ్లాప్ అయినా కూడా ధమాకా హిట్ తో పాటు తన డాన్స్ మరియు యాక్టింగ్‌ స్కిల్స్ తో వావ్‌ అనిపించుకుని స్టార్‌ హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలిచింది. స్టార్‌ హీరోలకు జోడీగా శ్రీలీల వరుస సినిమాలను చేస్తూ దూసుకు పోతుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఆయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొంది.

నార్నే నితిన్ హీరోగా రూపొందిన ఆయ్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో శ్రీలీల పాల్గొంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేంత అర్హత నాకు ఇంకా వచ్చిందని నేను అనుకోవడం లేదు. అయితే నేను ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సినీ కుటుంబంలో ఒక మెంబర్‌ గా మాత్రమే వచ్చాను. ఇండస్ట్రీలో ఉన్న వారు అంతా నా కుటుంబ సభ్యులు, వారి కోసం నేను ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొన్నాను. మ్యాడ్‌ సినిమాలో నితిన్ నటన నాకు బాగా నచ్చింది. అతడికి ఈ సినిమా కూడా తప్పకుండా మరో విజయాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నాను.

ఆయ్ వంటి సినిమాలు నాకు ఇష్టం, అలాంటి ఎంటర్‌టైన్మెంట్‌ సినిమాల్లో నటించాలని అనుకుంటాను. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంను శ్రీలీల వ్యక్తం చేసింది. భారీ పోటీ మధ్య విడుదల అవ్వబోతున్న ఆయ్ సినిమాకు ఇప్పటి వరకు అయితే పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయ్యింది. కనుక మంచి ఓపెనింగ్స్ ఈ సినిమాకు వస్తాయనే నమ్మకంను బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆయ్‌ కి మంచి ప్రమోషన్ చేశారు, అందుకే ఇతర సినిమాలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా వసూళ్లు నమోదు అవుతాయని అంతా నమ్మకంగా ఉన్నారు.

 

No comments:

Post a Comment

Post Top Ad