'రాజాసాబ్'తో టాలీవుడ్ కి పరిచయమవుతోంది మలయాళం బ్యూటీ మాళవిక మాహనన్. అమ్మడు తొలి సినిమానే ఏకంగా డార్లింగ్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఈ విషయంలో అమ్మడు ఎంతో లక్కీ. డార్లింగ్ సరసన నటించాలని ఎంతో మంది స్టార్లు హీరోయిన్లు ఆశపడుతున్నారు. కానీ వాళ్లెవ్వరికీ రాని అవకాశం దర్శకుడు మారుతి మాళవివకు కల్పించడంతో సాధ్యమైంది.
అయితే అంతకు ముందే ప్రయోగాత్మక చిత్రం 'తంగలాన్' తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. విక్రమ్ హీరోగా నటించిన సినిమా అనువాద రూపంలో ఇక్కడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయం సాధిస్తే అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోవడం ఖాయం. 'రాజాసాబ్' కి ముందే పాన్ ఇండియానే షేక్ చేస్తుంది. మరి ఇదంతా ముందే ఊహించాడో? ఏమోగానీ ఓ నెటిజనుడు మాళవికను నేరుగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావ్? అని అడిగేసాడు.
అమ్మడు ఆన్లైన్ వేదికగా నెటి జనులతో ముచ్చటిస్తోన్న సందర్భంలో ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. అన్నింటికి ఎంతో ఓపికగా సమాధానం చెప్పిన అమ్మడు పెళ్లి గురించి అడిగేసరికి కాస్త ఫీలైనట్లే కనిపించింది. మరి అతడు అడిగిన విధానం నచ్చలేదా? పెళ్లి అంటేనే కోపం తన్ను కొచ్చేసిందా? అన్నది తెలియదు సుమీ.
No comments:
Post a Comment