షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి క్రేజీ స్టార్లతో వరుసగా స్పై యాక్షన్ సినిమాలను నిర్మించిన యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్శ్ లోకి ఇప్పుడు మహిళా లీడ్ లను తీసుకు వస్తోంది. ఇందులో తొలి ఆఫర్ ఆలియాను వరించింది. గట్సీ లేడీ స్పై(మహిళా గూఢచారి)గా ఆలియా విరోచిత పోరాటాలు, సాహసవిన్యాసాలతో అలరించనున్న సినిమా కోసం యష్ రాజ్ బ్యానర్ భారీ పెట్టుబడులు పెడుతోంది. వైఆర్ఎఫ్ నిర్మిస్తున్న `ఆల్ఫా` అనే గూఢచారి చిత్రంలో ఆలియా సాహసాలు మైమరిపిస్తాయని, స్టంట్స్ మరో లెవల్లో ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం మేరకు..`ఆల్ఫా`లో యానిమల్ స్టార్ బాబీ డియోల్ (ఒకప్పటి హిందీ హీరో) కూడా చేరాడు. ప్రస్తుతం బాబీ డియోల్ - అలియా భట్ మధ్య క్రేజీ ఫైట్ సీక్వెన్స్ ని మేకర్స్ షూట్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా హైలైట్‌లలో ఒకటిగా ఉంటుందని, కీలక దశలో ఈ స్టంట్ సీన్ వస్తుందని మేకర్స్ వెల్లడించారు.
`ఆల్ఫా` యష్ రాజ్ ఫిలింస్ గూఢచారి విశ్వంలో మొట్టమొదటి మహిళా గూఢచారి చిత్రం. తదుపరి పఠాన్, టైగర్ ఫ్రాంచైజీలకు లింక్ చేస్తూ ఆల్పా గూఢచర్యం కొనసాగుతుందని అంచనా. అంటే భవిష్యత్ లో షారూఖ్- సల్మాన్‌లతో కలిసి ఆలియా యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొట్టే వీలుందని ఊహించవచ్చు. స్పై యానివర్శ్ కాన్సెప్టుల్లోకి లేడీ గూఢచారులను తీసుకు రావడం అనేది మహిళా అభిమానులను వ్యూహాత్మకంగా థియేటర్లకు గుంజడమేనని కూడా విశ్లేషిస్తున్నారు.
#Olympics2024 #NirmalaSitharaman #Rahulgandhi #RevanthReddy #Apassemblysession #Googletrends #Devara #Pushpa2
No comments:
Post a Comment