కాంతారా 2.. టార్గెట్ ఫిక్స్ అయినట్లే...! - Telugu Cinema Samacharam

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, 27 July 2024

కాంతారా 2.. టార్గెట్ ఫిక్స్ అయినట్లే...!

 


కన్నడ నాట అత్యంత భారీ బడ్జెట్ తో రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కాంతారా 2. బ్లాక్ బస్టర్ మూవీ కాంతారాకి ప్రీక్వెల్ గా ఈ చిత్రం రెడీ అవుతోంది. మొదటి సినిమాని కేవలం 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా అందుకుంది. దీంతో కాంతారా 2 పైన ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో ఇది కూడా ఉందని చెప్పాలి.
ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి కాంతారా 2 సినిమాపై చాలా శ్రద్ధ పెట్టి చేస్తున్నారు. మొదటి పార్ట్ కంటే బెస్ట్ ఇవ్వాలని అద్భుతమైన కథని చెప్పడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే కాంతారా ఫ్రీక్వెల్ కథని అతను చెప్పబోతున్నారు. ఈ మూవీ కంటెంట్ కూడా చాలా రిచ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అద్భుతమైన కథాంశంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ని ఈ మూవీలో రిషబ్ శెట్టి ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. 

హోంబలే ఫిలిమ్స్ ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం విశేషం. మొదటి సినిమా ద్వారా వచ్చిన ప్రాఫిట్ లో మెజారిటీ ఈ కాంతారా 2 కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ చిత్రంలో గ్రాండ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంతారా 2 చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారంట.

పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. కాంతారా 1 మొదటిగా కన్నడంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత ఇతర భాషలలో డబ్బింగ్ చేసి కాస్త.ఆలస్యంగా విడుదల చేశారు. అయితే కాంతారా 2 చిత్రాన్ని మాత్రం అన్ని భాషలలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే శాండిల్ వుడ్ నుంచి రాకింగ్ స్టార్ యష్ తర్వాత మరో పాన్ ఇండియా హీరో వచ్చినట్లు అవుతుంది.

 

 

 

#Olympics2024 #NirmalaSitharaman #Rahulgandhi #RevanthReddy #Apassemblysession #Googletrends #Devara #Pushpa2




No comments:

Post a Comment

Post Top Ad