హీరో కార్తి (Karthi).. ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ను భయపెట్టేస్తున్నాడు. అసలు కార్తికి, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కి ఉన్న లింకేంటి ? అనేది తెలుసుకోవాలంటే ‘సర్దార్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. అభిమన్యుడు (Abhimanyudu) ఫేమ్ మిత్రన్ (Mithran) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కార్తి ఇప్పటి వరకు చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారని అర్థమవుతుంది. స్పై అయ్యుండి కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్‌ను భయపెట్టేలా తన పాత్ర ఉందంటే.. పాత్రలోని డెప్త్‌లో స్టోరిలో ట్విస్టులు, టర్నులను అర్థం చేసుకోవచ్చు. తను ఆరు గెటప్స్‌లో కనిపించబోతున్నారు. ఈ గెటప్స్ వెనుకున్న మతలబేంటి!
తెలుగు, తమిళ భాషల్లో సర్దార్ సినిమా (Sardar Movie) దీపావళికి (Deewali) సందడి చేయనుంది. కాగా శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను (Sardar Teaser) చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించగా, తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni) మూవీని విడుదల చేయనున్నారు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ (G.V.Prakash) సంగీతాన్ని అందిస్తున్నారు. రాశీఖన్నా (Raashi Khanna) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రజీషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రల్లో నటించారు.
No comments:
Post a Comment