దాదాపు కొన్ని వేల కోట్లు నష్టం కలిగించి చైనా ఆర్థిక వ్యవస్థ ను భారత ప్రభుత్వం అతలాకుతలం చేసింది. ఒకేసారి వారి దేశానికి చెందిన 59 యాప్స్ ను నిషేధించిన భారత ప్రభుత్వం ఆ తర్వాత వారికి ఇచ్చిన అన్ని కాంట్రాక్ట లను కూడా వెనక్కి తీసేసుకునే చర్యలను మొదలు పెట్టింది. అయితే ఇప్పటికీ మళ్ళీ తిరిగి భారత్ లో తమ ప్రస్థానం మొదలు పెడతామని ఎంతోకొంత ఆశ తో ఉన్నారు చైనీయులు. విదేశాంగ మంత్రి వర్గంతో చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని గత రెండు రోజుల నుండి చెబుతూనే ఉన్నారు. త్వరలోనే మళ్ళీ అన్ని ప్రైవసీ పాలసీలను సమీక్షించి భారత్ ముందుకి మరింత మంచి ప్రపోజల్ తో వస్తామని అన్నారు.
అయితే ఈ లోపల టెలికామ్ దిగ్గజం లో ఒకటైన రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ నీ చైనా కు భారీ షాక్ ఇచ్చాడు. గతంలో చెప్పిన 'జియో మీట్' ను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఇది చైనాకు చావు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటివరకు కొద్ది మంది వినియోగదారులకు మాత్రమే లభ్యం అయిన ఈ యాప్ ఇప్పుడు జియో మరియు నాన్-జియో కస్టమర్లు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ సాయంతో ఒకేసారి వంద మంది వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆ వీడియో కాన్ఫరెన్స్ ఫుల్ హెచ్ డి రిజల్యూషన్ తో ఉంటుంది.
ఇక దీనికి సంబంధించి డెస్క్టాప్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. డెస్క్టాప్ లో ఇంటర్నెట్ బ్రౌజర్ లో మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీనికి విడిగా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పటి వరకూ లాక్ డౌన్ సమయం లో ఉద్యోగులందరూ గ్రూప్ మీటింగ్స్ చేసుకునేందుకు చైనా యాప్ లను వాడేవారు. ముఖ్యంగా బిజినెస్ మెన్స్ మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే అయితే జూమ్ యాప్ లేదా చైనీస్ యాప్ లను వాడుతుండగా.. వాటిల్లో జూమ్ యాప్ తో వారి గోప్యతకు భంగం వాటిల్లుతుందని భారతీయ నిఘా వర్గాలు చెప్పాయి.
ఇప్పుడు అంబానీ చైనా వారికి మళ్లీ భారత్ లోనికి ఎంట్రీ లేకుండా ఒకేసారి 'జియో మీట్' ప్రవేశపెట్టి వారి ఆశలను అడియాశలు చేశాడు. ఇక ఈ దెబ్బతో చైనా కోలుకోవడం కష్టమే. ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ లో వందమంది చర్చించుకునే అవకాశం అంటే మాటలా..?
No comments:
Post a Comment