టిక్‌టాక్ యాప్.. ఇటీవల కాలంలో ఎంత క్రేజ్ సంపాధించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్ లలో టిక్ టాక్ ఒకటి. చైనీస్ ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ "బైటీ డ్యాన్స్"టిక్ టాక్ ను డెవలప్ చేసింది. 2016లో డౌయిన్ పేరుతో ఇది చైనాలో లాంఛ్ అయింది. చైనాలో లాంఛ్ అయిన ఏడాది తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలోకి టిక్ టాక్ పేరుతో ఈ యాప్ ప్రవేశించింది. అయితే ఇప్పుడు టిక్‌టాక్‌కు పోటీ ఇచేందుకు మిత్రో యాప్ రంగంలోకి దిగింది.
భారతదేశానికి చెందిన ఈ మిత్రో షార్ట్ వీడియో షేరింగ్ యాప్ ఇది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ యాప్ కేవలం నెల రోజుల్లోనే 50 లక్షల సార్లు డౌన్‌లోడ్స్‌తో రికార్డ్ సృష్టించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం రోజూ 5 లక్షల డౌన్‌లోడ్స్ జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే.. ఖచ్చితంగా మిత్రో యాప్ టిక్‌టాక్‌కు ధీటుగానే వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు. ఐఐటీ రూర్కీకి చెందిన విద్యార్థి 'మిత్రో' యాప్‌ను రూపొందించాడు. అంటే ఇది మేడ్ ఇన్ ఇండియా యాప్ అన్నమాట.
ప్రస్తుతం దేశమంతా యాంటీ చైనా సెంటిమెంట్ ఉండటం కూడా 'మిత్రో' యాప్‌కు బాగా కలిసొస్తుంది. ఇక టిక్‌టాక్ యాప్ లాగానే మిత్రో ఉంటుంది. స్వైప్ చేసి వీడియోలు చూడొచ్చు. వీడియోలు క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, షేర్ చేయడానికి ఈ యాప్ యూజ్ చేయవచ్చు. అలాగే ఈ యాప్‌కు పెట్టిన పేరు కూడా ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. మిత్రో అంటే స్నేహితులను ఉద్దేశించి హిందీలో పిలుస్తుంటారు. మరియు నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ఇచ్చే ప్రతీ స్పీచ్‌లోనూ మిత్రో అనే పదం తప్పకుండా ఉంటుంది. అలా ప్రజలకు ఈ పదం వినడం కామన్ అయిపోయింది. ఇక ఈ పేరుతో మిత్రో యాప్ రావడంతో... మరింత క్రేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు.
No comments:
Post a Comment