ప్రముఖ దిగ్గజ టెలికాం రంగ సంస్థ అయిన జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా జియో ఫైబర్ వార్షిక ప్లాన్ పై డేటాను వినియోగదారులకు అందించేందుకు సిద్ధమయ్యింది. దీనితో jio సంస్థ తన అధికారిక వెబ్ సైట్ లో కూడా కూడా మార్పులు చేయడం జరిగింది. బ్రోన్జ్ ప్లాన్, టైటానియం ప్లాన్ ఇలా అన్ని ప్లాన్స్ పై డబుల్ డేటాను అందించేందుకు సంస్థ సిద్ధమయ్యింది.
ఈ ఆఫర్ కావాలంటే మాత్రం వార్షిక సబ్ స్క్రిప్షన్ కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం లాక్ డౌన్ నియమాలు క్రమంగా రోజు రోజుకి ఎత్తివేస్తూ ఉన్నందున ఈ డబుల్ డేటా లాభాలు త్వరలో ముగిసిపోతున్నాయి. ఇక బ్రోన్జ్ ప్లాన్ తరహాలోనే జియో ఫైబర్ సిల్వర్ ప్లాన్ చేసుకున్నట్లు అయితే 800 gb, గోల్డ్ ప్లాన్ ద్వారా నెలకు 1750 gb డేటాని అందించబడుతుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు డైమండ్ ప్లాన్ ద్వారా 4000 gb, ప్లాటినం ప్లాన్ ద్వారా 7500 gb డేటాను వినియోగదారులకు అందించబోతుంది. మొత్తానికి అన్నిటికంటే అధిక ప్లాన్ అయిన ప్రీమియం ప్లాన్ అయిన టైటానియం ప్లాన్ ఏకంగా 15000 gb డేటాను అందించబడుతుంది.
ఇక ఈ ప్లాన్ పై లభించే డబుల్ డేటా లాభాల ఆధారంగా లభించింది. అంతే కాకుండా ఇందులో లభించే ఇంట్రడక్టరీ డేటా కూడా ఆరు నెలల వరకు వస్తుంది. ఇక ఈ డబుల్ డేటా ఆఫర్ మరీ ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు కనపడటం లేదు. ఒకసారి లాక్ డౌన్ ముగిసిన అనంతరం ఈ ఆఫర్ ను తొలగించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కనుక ఆసక్తిగలవారు వీలైనంత త్వరలో రీఛార్జ్ చేసుకుంటే అధిక డేటాను పొందవచ్చు సులువుగా.
No comments:
Post a Comment