పాస్‌లు లేకుండానే అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేయవచ్చు... - Telugu Cinema Samacharam

Breaking

Post Top Ad

Post Top Ad

Monday, 1 June 2020

పాస్‌లు లేకుండానే అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేయవచ్చు...

కేంద్రం అంతా ఊహించినట్టుగానే లాక్ డౌన్ ను మరోసారి పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రెండు, మూడు వారాలు లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం లాక్ డౌన్ ను ఈసారి నెల రోజులు పొడిగిస్తూ కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి జూన్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐదో విడత లాక్ డౌన్ అమలు కానుంది. తాజా లాక్ డౌన్ లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ప్రజలకు, సరుకుల రవాణాకు ఎలాంటి ప్రత్యేక పాస్‌లు అవసరం లేదని స్పష్టం చేసింది. 

అయితే అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి కేంద్రం మెలిక పెట్టింది. అవసరమైతే రాష్ట్రాలు అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆంక్షలు విధించవచ్చని తెలిపింది. అయితే ప్రజలకు మాత్రం ముందుగానే అందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పేర్కొంది. కేంద్రం విధించిన ఈ నిబంధనతో ఏ రాష్ట్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రాష్ట్రాలు అనుమతులు ఇవ్వకపోతే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి ఇబ్బందే అని చెప్పవచ్చు. 

No comments:

Post a Comment

Post Top Ad