కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఆర్ధికంగా నష్టపోతున్న రాష్ట్రాలు ఇప్పుడు మద్యం ద్వారా తమ ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మద్యం షాపులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రెస్టారెంట్ లు బార్లకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. మే 9 నుంచి 17 వరకు మద్యాన్ని రిటైల్ ధరలకు అమ్ముకోవచ్చు అని ఉత్తర్వులు ఇచ్చింది. మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకుని వెళ్ళడానికి మాత్రమే అనుమతులు ఇచ్చింది. ఆ రాష్ట్రంలో కరోనా పూర్తి కట్టడిలో ఉంది. కేవలం 346 మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి.
No comments:
Post a Comment