దేశంలో మరోమారు లాక్ డౌన్ పొడగించబడింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మే 3న ముగుస్తున్న లాక్ డౌన్ మరో రెండు వారాలు కొనసాగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వివిధ సేవలు అందుబాటులో ఉండటం, మరికొన్ని సేవలను మూసి ఉంచడం చేయనున్నట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వ్యవసాయ పనులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రెడ్ జోన్లలో ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ సేవలు, డేటా కాల్ సెంటర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రెడ్ జోన్లలో సైకిళ్లు, ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, సెలూన్లకు అనుమతి లేదు. రవాణా, విద్యాలయాలు, సినిమాహాళ్లు, జిమ్‌లు, క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్‌ఫూల్స్ మూసే ఉంటాయి. గ్రీన్ జోన్ల పరిధిలో 50 శాతం ప్రయాణికులతో బస్సులు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది.
రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సైకిళ్లు, రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, బస్సులు, కటింగ్ షాపులపై నిషేధం విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైలు, విమాన ప్రయాణాలు, మెట్రో సర్వీసులు దేశమంతా బంద్ ఉంటాయని స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య ఎటువంటి బస్సులు తిరగడానికి లేదని స్పష్టం చేసింది. అయితే, అంతర్ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదని కేంద్రం ప్రకటించింది. గ్రీన్ జోన్ల పరిధిలో 50 శాతం ప్రయాణికులతో బస్సులు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూసి ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూత పడి ఉండనున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మే 17 వరకు తెరవడానికి లేదు. జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, అన్ని ప్రార్థన స్థలాలు మూసి ఉంచాల్సిందే. మత పరమైన సదస్సులు, సభలు పెట్టకూడదని తెలిపింది.
కాగా, వారానికి ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితిని పరిశీలించనున్నారు. కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లగా మార్చనున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. గ్రీన్ జోన్లలో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇచ్చారు. కార్లలో ఇద్దరికి, టూ వీలర్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.
No comments:
Post a Comment