ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 16,208 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా సీఎం జగన్ జరిపిన సమీక్షలో అధికారులు జగన్ కు రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సీఎం జగన్ పోస్టులను భర్తీ చేయాలని సూచించగా ఆగష్టు 31 నాటికి పోస్టులను భర్తీ చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.
గతంలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత నెలలోనే పరీక్షలు జరగాల్సి ఉన్నా లాక్ డౌన్ వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగష్టు నెల 31లోపు ఈ పోస్టుల భర్తీ జరగనుందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఈ పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు.అధికారులు సీఎం జగన్ కు ఆగష్టు 31 లోపు గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
మరోవైపు ఏపీలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1887 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 547 కరోనా కేసులు నమోదు కాగా విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 4 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని రాష్ట్రవ్యాప్తంగా 842 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.
మరోవైపు ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా కష్ట కాలంలో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన రైతుల ఖాతాలలో 5500 రూపాయలు జమ చేయనుంది. లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా జగన్ సర్కార్ ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.
No comments:
Post a Comment