ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న coronavirus బారిన ఇప్పటికే 9 లక్షలమందికిపైగా పడ్డారు. అందులో 47వేలమందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇంకా అలాంటి ఈ coronavirus ఇన్నాళ్లు అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో విజృంభించేది. ఇప్పుడు భారత్ లో కూడా తన విశ్వరూపం ఏంటో చూపిస్తుంది.
coronavirus సంఖ్య పదులలో ఉన్న సమయంలోనే ప్రజలు ఎవరు బయటకు రాకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయినప్పటికీ భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2వేలు దాటింది. ఇంకా దేశవ్యాప్తంగా 2వేలమంది corona బారిన పడితే మన రెండు తెలుగు రాష్ట్రాలలోని ఏకముగా 200 కేసులుపైగా నమోదయ్యాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణాలో ఒక్క నిన్నే 30 coronavirus పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణాలో corona పాజిటివ్ కేసుల సంఖ్య 127కు చేరింది. అయితే coronavirus పై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏంటి అంటే? ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచే కరోనా వ్యాప్తి విస్తృతమవుతోంది.
ఇంకా తెలంగాణ నుంచి 1,030 మంది ప్రతినిధులు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారని వైద్య ఆరోగ్యశాఖే నిర్ధారించింది. వీరిలో 160 మందిని తప్ప అందరినీ గుర్తించారు. అయితే ఈ వెయ్యి మంది సరాసరి పది మంది చొప్పున 10 వేల మందితో కాంటాక్ట్ అయ్యుంటారని అంచనా వేస్తున్నారు. అయితే నిజానికి ఒకరు పదిమందిని కాదు అంతకు మించే కలిసి ఉండచ్చు.. కొరియాలో ఒక్క మహిళే పది వేలమందికి అంటించింది.. అలాంటిది ఈ వెయ్యిమంది మరో పది వేలమంది అంటించి ఉంటారు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అసలు వీరిలో ఎంతమందికి కరోనా వైరస్ ఉంది అనేది తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment