తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్...! - Telugu Cinema Samacharam

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, 26 March 2020

తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్...!


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా 
ఉన్న కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత వేగంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే అది మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు అనే చెప్పాలి. కరోనా వైరస్ కారణంగా రెండు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేసే పరిస్థితి అనేది ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఎలా కట్టడి అవుతుందో తెలియదు. 

అయితే కరోనా వైరస్ కేసులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు నాలుగు పెరిగాయి. గుంటూరు విజయవాడ సహా తెలంగాణాలో కూడా కేసుల సంఖ్య అనేది క్రమంగా పెరుగుతుంది. అయితే ఈ కేసులు అన్నీ కూడా విదేశాల నుంచి వచ్చిన వారికే కావడం గమనార్హం. వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్నారు. ఎవరూ కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీనితోనే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది ఇప్పుడు. ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా హెచ్చరిస్తున్నా సరే ప్రజలు మారడం లేదు.
ఫలితంగా కేసుల సంఖ్య అనేది క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో కేసులు క్రమంగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణాలో విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పుడు కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగించే అంశం. దీనితో నిత్యావసర సరుకులను ఇళ్లకే పంపించాలి అనే దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. ప్రజలను అసలు ఏ విధంగా బయటకు రాకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు.

No comments:

Post a Comment

Post Top Ad