బాబోయ్.. ఆ దేశంలో ఒక్క రోజే కరోనాతో 656 మంది మృతి..? - Telugu Cinema Samacharam

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, 26 March 2020

బాబోయ్.. ఆ దేశంలో ఒక్క రోజే కరోనాతో 656 మంది మృతి..?


చైనా కేంద్రంగా పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు యూరప్ లో మరణ మృదంగం మోగిస్తోందిప్రతి రోజూ వందల్లో అక్కడ చనిపోతున్నారుకరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న యూరప్ దేశాల్లో ఇటలీస్పెయిన్ ప్రధానంగా ఉన్నాయితాజాగా అందుతున్న లెక్కల ప్రకారం.. స్పెయిన్ కూడా కరోనా వైరస్ ధాటికి అల్ల కల్లోలంగా మారుతోంది.

ఈ దేశంలో ఒక్కరోజే ఏకంగా 656 మందిని కరోనా బలి తీసుకున్నట్టు స్థానిక మీడియా చెబుతోందిస్పెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయిఒక విధంగా చెప్పాలంటే కరోనా మరణాల్లో ఆ దేశం చైనాను దాటిపోయిందిచైనాలో 3,285 మంది మాత్రమే మరణించారుకానీ స్పెయిన్‌లో ఈ సంఖ్య 3,647 కు చేరుకుందిఇక మరో యూరప్ దేశం ఇటలీ సంగతి చెప్పనక్కర్లేదు.

మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కరోనాకు బలైన వారి సంఖ్య 21 వేలు దాటిందిప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య నాలుగున్నర లక్షలు దాటిందిఅయితే వీరిలో లక్షా 14 వేలమంది వరకూ కోలుకోవడం కాస్త శుభ సూచకంగా కనిపిస్తోంది.

ఈ కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయికానీ అవి పూర్తిగా ఫలించడం లేదుఈ మహమ్మారికి మందు కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయిదీనికి మందు కనిపెట్టే లోపు ఇది విజృంభించి వేల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకుంటోందిసామాజిక దూరం పాటించడం ఒక్కటే ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకట్టే ఆయుధంగా కనిపిస్తోందిఅందుకే దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్‌ డౌన్ ప్రకటిస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయిమరి ఈ మహమ్మారి ఉధృతికి అడ్డుకట్ట పడేదెన్నడో..?



No comments:

Post a Comment

Post Top Ad